
నంద్యాలలో స్వైన్‌ఫ్లూ కేసు నమోదు
నంద్యాల(కర్నూలు): కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ఓ వ్యక్తి(52)కి స్వైన్‌ఫ్లూ సోకినట్లు వైద్యులు శనివారం నిర్ధారించారు. వివరాలు...నంద్యాల పట్టణానికి చెందిన ఒక వ్యక్తి స్వైన్‌ఫ్లూ లక్షణాలతో కొన్ని రోజుల క్రితం సన్‌షైన్ ఆస్పత్రిలో చేరాడు. వైద్య పరీక్షల కోసం డాక్టర్లు ఆయన రక్త నమూనాలను హైదరాబాద్కు పంపగా బాధితుడికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది.