
సాక్షి,అనంతపురం : అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై అసమ్మతి వర్గం భగ్గుమంది. నగర టీడీపీ మాజీ అధ్యక్షుడు జయరాం నాయుడు ఆధ్వర్యంలో అసమ్మతి నేతల సమావేశం ఆదివారం జరిగింది.
ఈ సమావేశంలో అసమ్మతి వర్గం ఆయనపై తీవ్ర విమర్శలు చేసింది. వచ్చే ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరికి టిక్కెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. ఒకవేళ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని హెచ్చరించారు. ప్రభాకర్ చౌదరి ఏకపక్ష వైఖరి వల్లే టీడీపీ సీనియర్ నేతలు నడిరోడ్డున పడ్డారని ఆరోపించారు. ఆయన ఇప్పటికే అక్రమ కేసులు ఎదుర్కొంటున్నారు, ఒక్కో కార్పోరేటర్ టికెట్ కోసం పది లక్షల చొప్పున వసూలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే బాగోతంపై త్వరలోనే సీఎంకు ఫిర్యాదు చేస్తామన్నారు.