అరాచక పాలనకు త్వరలోనే చరమగీతం
► టీడీపీ నాయకులకే ఇసుక ఉచితం
► అవినీతితో వేల కోట్లు దండుకుంటున్న బాబు
► పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తిరుపతి మంగళం: రాష్ట్రంలో నియంతలా చంద్రబాబు సాగిస్తున్న అరాచక పాలనకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడుతారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కుప్పం వైఎస్‌ఆర్ సీపీ ఇన్‌చార్జ్ కె.చంద్రమౌళి, మండల కన్వీనర్ వెంకటేష్‌బాబు ఆధ్వర్యంలో పంద్యాల మడుగు పంచాయతీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, రాజారెడ్డి రూపొందించిన ఉగాది క్యాలెండర్‌ను శుక్రవారం పెద్దిరెడ్డి నివాసంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాసమస్యలను చంద్రబా బు పూర్తిగా పట్టించుకోకుండా హిట్లర్, తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. మళ్లీ సీఎం కుర్చీ దొరుకుతుందో లేదోనన్న ఆలోచనతో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ వేల కోట్లు దండుకుంటున్నాడని ఆరోపించారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కోట్లు దండుకోవడానికి మాత్రమే ఇసు క ఉచితంగా అందిస్తున్నారని, సామాన్యుల కోసం కాదని తెలిపారు. రాజధా ని నిర్మాణం పేరుతో 33 వేల ఎకరాల పేదల భూములను అన్యాయంగా లాగేసుకున్నారన్నారు.
అధికారంలోకి వచ్చి న రెండేళ్లలో ప్రజా సంక్షేమం కోసం ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ, సంక్షే మ పథకం కానీ ప్రవేశపెట్టిన దాఖ లాలు లేవన్నారు. కుప్పం ఇన్‌చార్జ్ కె. చంద్రమౌళి మాట్లాడుతూ కుప్పంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని సిబ్బందికి రెండు సంవత్సరాలుగా జీతభత్యాలు ఇప్పించలేని గొప్ప నాయకుడు చంద్రబాబు అన్నారు. సొంత నియోజకవర్గంలోని ప్రజలకే న్యాయం చేయలేని చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఏమి చేస్తారని ప్రశ్నించారు. కుప్పం, రామకుప్పం నాయకులు బాబురెడ్డి, నాగభూషణ్‌నాయక్, బలరాంనాయక్, బావాజీనాయక్, వెంకటాచలం, చంద్రానాయక్ పాల్గొన్నారు.
జలసిరి నిబంధనలు మార్చాలి
రొంపిచెర్ల: జలసిరి పథకం నిబంధనలు మార్చాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. 250 అడుగుల వరకు వూత్రమే బోర్లు వేసేందుకు నిర్ణయుం తీసుకుందని తెలిపారు. ఈ నిర్ణయుం వలన రాయులసీవు జిల్లాలోని రైతులకు తీవ్ర అన్యాయుం జరుగుతుందన్నారు. 1000 నుంచి 1500 అడుగుల వరకు బోర్లు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రావూలలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేలకు నిధులు వుంజూరు చేయుడం లేదని ఆరోపించారు.