మెదక్ టౌన్, న్యూస్‌లైన్: తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక టీఆర్‌ఎస్ కార్యాలయం వద్ద మున్సిపల్ వార్డు సభ్యులకు సంబందించి 9 మంది అభ్యర్థుల పేర్లను ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ పట్టణ ప్రజలు తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేశారన్నారు. పట్టణాభివృద్ధి జరగాలంటే మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. 13 ఏళ్ల ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లను, అవమానాలను భరించి కేసీఆర్ ఢిల్లీ పెద్దలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రం సాధించారని కొనియాడారు.
రాబోయే స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త రాగి అశోక్ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం పట్టణంలోని 9వ వార్డులకు సంబంధించి పోటీ చేయనున్న అభ్యర్థులను ప్రకటించారు. 1వ వార్డులో శ్రీధర్‌యాదవ్, 2వ వార్డులో రాగి అశోక్, 3వ వార్డులో జెల్ల గాయత్రి సుధాకర్, 4వ వార్డులో సలాం, 5వ వార్డులో మెంగని విజయలక్ష్మి, 8వ వార్డులో మాయ మల్లేశం, 12వ వార్డులో మోచి కిషన్, 18వ వార్డులో ఏ.కృష్ణారెడ్డి, 26వ వార్డులో రెహనా బేగంను ప్రకటించారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎం. దేవేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ లావణ్య శ్రీనివాస్‌రెడ్డి, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కిష్టాగౌడ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, గంగాధర్, జీవన్, శ్రీకాంత్, ముకుందం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి
Published Wed, Mar 12 2014 12:22 AM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM
Advertisement