పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల 20న విశాఖపట్నంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేస్తారు.
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల 20న విశాఖపట్నంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేస్తారు. ఇందు కోసం పాఠశాల విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్మీడియెట్ ఫస్టియర్ ఫలితాలను విజయవాడలో, సెకండియర్ ఫలితాలను కర్నూలులో విడుదల చేసిన ప్రభుత్వం.. టెన్త్ ఫలితాలను విశాఖ వేదికగా విడుదల చేయాలని నిర్ణయించడం విశేషం.