కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఇందిరమ్మ పథకంలో జరిగే అక్రమాలకు చెక్ పడనుంది. ఇందుకోసం ప్రభుత్వం కొత్తగా జీవోటాగింగ్ అనే సిస్టమ్‌ను తీసుకరానుంది. ఈ టెక్నాలాజీ ద్వారా ఒకేఇంటిపై రెండు, మూడుసార్లు బిల్లులు పొందడం, లేదా ఇళ్లు నిర్మించుకోకుండానే బిలు కాజేయడం తదితర వాటికి చెక్ పడనుంది.
ఈ టెక్నాలాజీ ద్వారా ప్రత్యేకమైన సెల్‌ఫోన్‌లో మంజూరైన ఇళ్ల నిర్మాణాలు, వాటి బిల్లు మంజూరు, రేషన్ కార్డు, ఇళ్ల పొజిషన్, ఇంటి ఫొటోను పొందుపరుస్తారు. అనంతరం పూర్తి సమాచారంతో ఆన్‌లైన్‌ద్వారా ఎండీ కార్యాలయానికి మెయిల్ చేస్తారు. ఎండీ కార్యాలయంలో వీటన్నింటిని జిల్లాలవారిగా పొజిషన్, ఇళ్ల నిర్మాణం, మంజూరైయిన బిల్లు, సంబంధిత ఏఈ, డీఈల వివరాలను పొందుపరుస్తారు.
ఇక రాష్టంలో ఎక్కడ, ఏ ప్రాంతంనుంచైనా మరోసారి బిల్లు పొందటానికి, ఇళ్ల నిర్మాణం పూర్తి కాకాముందే బిల్లులు పంపించడానికి వీలులేకుండా ఎండీ కార్యలయంలో ఆన్‌లైన్ లాక్ చేసి ఉంటుంది. ఒకవేళ ఇళ్ల నిర్మాణం పూర్తవుతుంటే దశలవారిగా బిల్లు మంజూరు అవుతుంది. అంతేకాని పాత ఇళ్లకు బిల్లులు, ఒకే ఇంటికి రెండేసి సార్లు బిల్లులు తీసుకుంటే ఈ టెక్నాలాజీతో గుర్తుపట్టవచ్చు. దీంతో ఇక హౌసింగ్‌లొ జరిగే అక్రమాలకు దాదాపు చెక్ పడ్డట్టేనని అధికారులు అంటున్నారు.
దీనికొసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాలు బయలు దేరనున్నాయి. ఈ బృందాలు జిల్లాలొ మొదటి విడతలో మంజూరైన ఇళ్లు 55,464 రెండో విడతలో 43,796, మూడో విడతల్లో 38,349 మంజూరైన ఇళ్లు, రచ్చబండ ఫేస్-1(జీఓ నం. 33)లో 18,218 ఇళ్లు, ఫేస్ 2(జీఓ నం 44)లో 15,260 ఇళ్లు, జీఓ నం 171లో 12.963, తాజాగా జీఓ నం 23లో 50,605 మంజూరైన ఇళ్లు వాటి ఫొటోలు, మంజూరు చేసిన అధికారి, లబ్ధిదారుల వివరాలు సేకరించనున్నారు.
ఈ ప్రక్రియను చేపట్టాడానికి దేశంలో పేరుగాంచిన క్వారిటర్ ఇండియా అనే సంస్థకు అప్పగించారు. వీరు త్వరలో జిల్లాకు చేరుకోని జీవొటాగింగ్ సిస్టమ్ ద్వారా హౌసింగ్‌లో జరిగిన బొగస్ బాగొతాన్ని బయటపెట్టనున్నారు.
‘ఇందిరమ్మ’ అక్రమాలకు చెక్
Published Fri, Feb 7 2014 1:54 AM | Last Updated on Sat, Aug 11 2018 8:06 PM
Advertisement
Advertisement