కొత్త రైళ్ల కోసం నిరీక్షణ
విశాఖ జోన్ రావాలని ఆకాంక్ష
సమస్యల కూత కూస్తున్నా చలనం లేని పాలకులు
నేటి రైల్వే బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి
నువ్వు ఎక్కాల్సిన రైలు ఓ జీవిత కాలం లేటు అన్నారో కవి. స్మార్ట్ సిటీగా ఎదుగుతున్నా విశాఖ రైల్వే ఇంకా ఒడిదుడుకుల్లోనే ఉంది. గుండెల్లో ఆశల కూత వినిపిస్తున్నా వరాల బండి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడాల్సి వస్తోంది. ఈసారైనా నిరీక్షణ ఫలించేనా... కల నెరవేరేనా అని ఉత్తరాంధ్రవాసులు ఎదురుచూస్తున్నారు.
విశాఖపట్నం సిటీ: రైల్వే బడ్జెట్ రాబోతుంది. కొత్త రైళ్లు వస్తాయా...వచ్చే రైళ్లు తమ స్టేషన్‌లో ఆగుతాయా...ఆ రైల్లో ఏయే ఊళ్లకు వెళ్లవచ్చు. టికెట్ ధరలు ఏమైనా పెంచుతారా...ప్రత్యేక రైళ్లను రెగ్యులర్ చేస్తారా...ఇలా అనేక ఆశలతో ప్రయాణికులు ఆశగా బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నారు. గురువారం రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రకటించనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉద్యోగుల్లోనూ తీవ్ర ఉత్కంఠ ఆవహించింది. ఉద్యోగులపై ఏమైనా ‘ప్రభు’ కనికరం చూపుతారేమోనని చూస్తున్నారు. నాలుగు రాష్ట్రాల్లో 1100 కిలోమీటర్ల మేర విస్తరించి వున్న వాల్తేరు డివిజన్ రైల్వే బడ్జెట్ కోసం ఆశగా ఎదురు చూస్తోంది. 2015 బడ్జెట్‌లో నైనా కొత్త జోన్‌ప్రతిపాదన వుంటుందేమోనని కలలుగంటోంది. ఏళ్ల తరబడి నానుతున్న ప్రత్యేక జోన్ డిమాండ్ ఏటా మాదిరి గానే ఈ కొత్త ఏడాదీ ప్రతిధ్వనిస్తోంది. తాము అధికారంలోకి వ స్తే క చ్చితంగా రైల్వే జోన్ సాధిస్తామంటూ ప్రగల్భాలు పలికిన బీజేపీ ఇప్పుడు ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతుండడం తో ఈ ఆశలకు మరింత బలం చేకూర్చుతోం ది. ప్రత్యేక జోన్ లేకపోయినా కనీసం ప్రస్తావ న అయినా వుంటుందని వాల్తేరు ఆశిస్తోంది.
ఈ బడ్జెట్‌లో జోన్ లేనట్టే..!
రైల్వే జోన్ కోసం అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నప్పటికీ జోన్ ప్రకటన వుండకపోవచ్చు. ఈ విషయాన్ని ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు స్పష్టం చేయడంతో ఆ ఆశ లు సన్నగిల్లాయి. ఎంపీ హరిబాబు సైతం జోన్ వస్తుంది కానీ ఎప్పుడనేది ఇప్పట్లో కాదని తేల్చేయడంతో ఆశలు పూర్తిగా అడుగంటాయి.
కావాల్సిన రైళ్లు..!
విశాఖపట్నం-అలహాబాద్, విశాఖ-అహ్మదాబాద్, విశాఖ-లక్నో, విశాఖ-పాట్నా, విశాఖ -చండీగఢ్, విశాఖ-రామేశ్వరం, విశాఖ-వారణాసి, విశాఖ-మైసూర్, విశాఖ-బెంగళూ ర్, విశాఖ-గోవా, విశాఖ-పుట్టపర్తి, విశాఖ- తిరుపతి, విశాఖ-షిర్డీ, విశాఖ-సికింద్రాబాద్ (శతాబ్ది), విశాఖ-ఢిల్లీ (దురంతో), విశాఖ- ముంబాయి(దురంతో) వంటి రైళ్ల ఆవశ్యకత వుంది. ఈ రైళ్లు కావాలంటూ గత బడ్జెట్‌ల స మయాల్లో వాల్తేరు డివిజన్ నుంచి ప్రతిపాదనలు వెళ్లినా అవన్నీ ఆచ రణ సాధ్యం కాలేదు.
ఫ్రీక్వెన్సీ పెంచే రైళ్లు..!
వారానికి మూడు రోజులపాటు నడుస్తున్న విశాఖ-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్‌ను వారానికి అయిదు రోజులు గానీ, లేదా రోజూ నడిచేలా ప్రకటించే అవకాశాలున్నాయి. వారానికి అయిదు రోజులు నడుస్తున్న విశాఖ-నిజాముద్దీన్ సమతా ఎక్స్‌ప్రెస్‌ను ప్రతి రోజూ నడిచేలా ఈ బడ్జెట్‌లో నిర్ణయం తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు.వారానికి మూడు రోజులు నడుస్తున్న విశాఖ-అమృత్‌సర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్‌ను వారానికి అయిదు రోజులు పెంచే చాన్స్ వుంది. గత బడ్జెట్‌లో మంజూరై వారానికి ఒక రోజు మాత్రమే నడుస్తున్న విశాఖ-గాంధీధాం, విశాఖ-జోధ్‌పూర్, విశాఖ-కొల్లాం, విశాఖ-షిర్డీ, విశాఖ-చెన్నై, విశాఖ-పారాదీప్ వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లను వారానికి మూడు రోజులు పెంచే చాన్స్‌లు వున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి.
పెండింగ్ ప్రాజెక్టులకు జెండా ఊపుతారా..!
తూర్పు కోస్తా రైల్వే ఆరంభం నుంచీ వాల్తేరు డివిజన్ రైల్వే ఎలా వుందో గత పుష్కర కాలంలో ఆదాయాన్ని అయితే గణనీయంగా పెంచగలుగుతోంది. కానీ కొత్త ప్రాజెక్టులను మాత్రం సాధించలేకపోతోంది. ఈ విషయంలో ఉత్తరాంధ్ర ఎంపీలంతా ఉత్త చేతుల్తోనే తిరిగొస్తుండడంతో కొత్త ప్రాజెక్టులనేవి లేకుండా పోయాయి. బ్రిటిష్ కాలం నాటి ప్రాజెక్టులే తప్పితే గత 25 ఏళ్లలో సాధించిన చె ప్పుకోదగ్గ ప్రాజెక్టు ఒక్కటీ లేదనే చెప్పాలి. వ్యాగన్ వర్క్‌షాప్‌కు అన్నీ అనుకూలమనే అంటున్నారు గానీ టెంకాయ కొట్టిన పాపాన పోలేదు.
కొత్తవలస-కిరండూల్ (కెకె) రైల్వే లైన్‌ను డబులింగ్ చేసే ప్రయత్నమే చేయడం లేదు. ఏటా రూ. 5 వేల కోట్ల పైబడి ఆదాయం ఈ ఒక్క మార్గం గుండానే రైల్వేకి చేరుతున్నా ఆంధ్రలో ఈ లైన్ వుందని అభివృద్ధికి నోచుకోవడం లేదు. కనీసం రెండు ప్యాసింజర్ రైళ్లయినా నడిపే సాహసం చేయడం లేదు.
కొత్తవలస-రాయగడ (కేఆర్) రైల్వే లైన్‌లో విద్యుదీకరణ పనులు చేపట్టే ప్రాజెక్టు సైతం మంజూరు కావడం లేదు. ఈ మార్గం తెలుగు ప్రజలతో మమేకమై వుంటుంది. నర్సీపట్నం-పలాస (వయా రాజాం) కొత్త రైల్వే లైన్ సర్వేకి గత బడ్జెట్‌లో ప్రకటించినా అతీగతీ లేదు. కేవలం ఏరియల్ సర్వేతో సరిపెట్టేశారు. ఈ మార్గం వేస్తే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని గిరిజన, గ్రామీణ ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయి. 2012 రైల్వే బడ్జెట్‌లో విశాఖ రైల్వే స్టేషన్‌ను ప్రపంచ శ్రేణి రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేయడంతో బాటు మల్టీ కాంప్లెక్స్ నిర్మాణం చేపడతామని ప్రకటించారు. ఎస్కలేటర్, సీసీ కెమేరాలు అయితే వచ్చాయి గానీ వీఐపీ లాంజ్, ఫుడ్ కోర్టులు, మల్టీప్లెక్స్ నిర్మాణాలు రాలేదు. ఇప్పటికీ ఆ ప్రాజెక్టులు పెండింగ్‌లోనే వున్నాయి. కనీసం ఈ బడ్జెట్‌లోనైనా నిధులు మంజూరు చేస్తారేమోనని ఆశగా నిరీక్షిస్తున్నారు.
జనసాధారణ్ రావొచ్చు..!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనసాధారణ్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రాధాన్యమిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో విశాఖకు ఈ రైళ్లు రెండు వరకు కేటాయించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. కొత్తరాజధాని విజయవాడ రాకపోకలకు సాధారణ కోచ్‌లతో కూడిన ఇంటర్‌సిటీ రైలును మంజూరు చేసేందుకు అవకాశాలున్నాయని రైల్వే వర్గాలంటున్నాయి.
ప్రయత్న లోపం సుస్పష్టం
రైల్వే బడ్జెట్‌కు ముందు అన్ని రాష్ట్రాల్లో నూ ఎంపీలంతా తమతమ జోనల్ మేనేజర్ల ను కలిసి కొత్త రైళ్లు, కొత్త ప్రాజెక్టులపై చర్చిస్తా రు. ఆయా ప్రతిపాదనలను రైల్వే జీఎంల ద్వా రా రైల్వే బోర్డుకు చేరేలా ప్రయత్నిస్తారు. రైల్వే బోర్డులో తమ పలుకుబడిని ఉపయోగించి కొ త్త రైళ్లను సాధిస్తారు. ఆ విధంగా తమ ప్రాం తీయుల కోసం కొత్త రైళ్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ తమను గెలిపించినందుకు రుణం తీర్చుకుంటారు. రైల్వే మంత్రిత్వ శాఖ, ైరె ల్వే బోర్డు ఆలోచనలు ఎలావున్నా ఉత్తరాంధ్ర ప్ర జాప్రతినిధుల ప్రయత్నలోపం స్పష్టంగా కని పిస్తోంది. రైల్వే కాలపట్టిక సమావేశానికి ముం దు తెలంగాణ రాష్ట్ర ఎంపీలతోబాటు ఆంధ్రాలోని విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు దక్షిణ మ ద్య రైల్వే జనరల్ మేనేజర్‌తో భేటీ అయి కావాల్సిన రైళ్లను, ప్రాజెక్ట్‌లపై చర్చించి ప్రతిపాదనలిచ్చారు.
అలాగే ఒడిశాలోని ప్రజాప్రతినిధు లు కూడా తూర్పుకోస్తా రైల్వే జీఎం ను కలిసి ప్రతిపాదనలు అందజేశారు. అక్కడితో ఆగకుండా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయ క్ నేరుగా ప్రధానమంత్రి, రైల్వే మంత్రిని కలి సి ఆ రాష్ట్రానికి కావలసిన కొత్త రైళ్లు, ప్రాజెక్ట్‌లపై వివరించి ప్రతిపాదనలు అందజేశారు. కానీ ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు మాత్రం రై ల్వే అవసరాల కోసం తూర్పుకోస్తా రైల్వే జీ ఎంను కలిసిన సందర్భమే లేదు. గత సెప్టెం బర్‌లో తూర్పుకోస్తా పరిధిలోని పార్లమెంట్ సభ్యులతో జరిగిన సమావేశంలో జీ ఎంను కలిసి కోరిన విజ్ఞప్తులే కొత్తగా చెప్పుకుంటున్నారు. ప్రజలను మభ్యపెడుతున్నారు.
ఆశల బండి వస్తోందండి...
Published Thu, Feb 26 2015 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM
Advertisement