వైఎస్సార్ జిల్లా(సిద్ధవటం): కడప- చెన్నై రహదారిపై కనుమలపల్లి వద్ద మోటార్ బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కడప రిమ్స్‌కు తరలించారు.