సాక్షి,కడప : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కడప నగరంలో నాగార్జున మోడల్‌స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి కోటిరెడ్డి కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. విద్యార్థులు దేశ నాయకుల వేషధారణలో సమైక్య నినాదాలతో హోరెత్తించారు. కలెక్టరేట్‌లో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. కలెక్టరేట్ వద్ద ఒంటిమిట్ట మండల ఉపాధ్యాయులు దీక్షల్లో కూర్చొన్నారు.
ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ సర్పంచ్ రమణయ్య నేతృత్వంలో 12మంది రిలే దీక్షల్లో కూర్చొన్నారు. వీరికి నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, మండల కన్వీనర్ కల్లూరు నాగేంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో విజయ్‌కుమార్ సర్కిల్‌లో విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు.
జమ్మలమడుగులో వైఎస్సార్ సీపీ నేత, దొమ్మరనంద్యాల మాజీ సర్పంచ్ బుసిరెడ్డి ఆధ్వర్యంలో 15మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత కుండా రామయ్య సంఘీభావం తెలిపారు.
బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల పట్టణంలో వైఎస్సార్‌సీపీ సేవాదళ్ కార్యకర్తలు ఖాజావలీ నేతృత్వంలో 15 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, కరెంటు రమణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలు సంఘీభావం తెలిపారు. బద్వేలు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో నారాయణ స్కూల్ విద్యార్థులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
రైల్వేకోడూరులో జేఏసీ ఛెర్మైన్ ఓబులేసు ఆధ్వర్యంలో పాతబస్టాండు వద్ద మానవహారాన్ని ఏర్పాటు చేశారు.
రాయచోటిలో న్యాయవాదుల రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి.
మైదుకూరులో ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు. వీరికి జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు.
సమైక్య జోరు
Published Wed, Nov 6 2013 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM
Advertisement