బాల్కొండ, న్యూస్‌లైన్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భద్రత పెంచుతామని ఎస్పీ మోహన్‌రావు పేర్కొన్నారు. పర్యాటకులకు భద్రత కల్పించడంలో పోలీసుల వైఫల్యంపై సోమవారం ‘సాక్షి’లో ‘విహారం.. ఓ విషాదం’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎస్పీ శుక్రవారం ప్రాజెక్టు వద్ద ఉన్న సబ్ కంట్రోల్ బూత్‌ను తనిఖీ చేశారు. పర్యాటకులు ప్రమాదకర స్థలాలకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అంతకుముందు ఆయన ఫ్లడ్ కంట్రోల్ రూంలో ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. భద్రత సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. డ్యాంపై కలియ తిరిగి భద్రతను పరిశీలించారు. అనంతరం సబ్ కంట్రోల్ బూత్ వద్ద విలేకరులతో మాట్లాడా రు. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా సిబ్బంది సంఖ్యను పెంచుతామన్నారు. ప్రధానంగా ఖరీఫ్ సీజన్ లో ప్రాజెక్టు జలకళ సంతరించుకుంటుందని, దీంతో పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చే రోజుల్లో భద్రత సిబ్బందిని పెంచుతామన్నారు. ఎస్సారెస్పీకి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను నియమించాలని ప్రభుత్వానికి నివేదిక పంపామని తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నట్లుగా ఎస్సారెస్పీకి కూడా భద్రత కల్పించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. సబ్‌కంట్రోల్ రూం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పెట్రోలింగ్ పెంచుతాం..
ప్రాజెక్టు ఆనకట్టపై అసాంఘిక కార్యకలాపాలను నిరోధించడానికి పెట్రోలింగ్ పెంచనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఆనకట్టపై మద్యం సేవించే, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరెస్టు చేసి, కేసులు నమోదు చేయాలని ఆదేశించామన్నారు.
జలవిద్యుదుత్పత్తి కేంద్రం సందర్శన
ప్రాజెక్టు దిగువ భాగాన ఉన్న జలవిద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఎస్పీ సందర్శించారు. విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న తీరును పరిశీలించారు. టర్బయిన్ల గురించి తెలుసుకున్నారు. ఆయన వెంట ప్రాజెక్టు డిప్యూటీ ఈఈ నరేశ్, ఏఈలు భోజదాసు, ర వీందర్, జెన్‌కో ఏడీ కిషోర్‌కుమార్, ఏఈ సతీశ్, ఆర్మూర్‌రూరల్ సీఐ సంక్రాంతి రవికుమార్, ఎస్సై ప్రతాప్ లింగం తదితరులున్నారు
ఎస్సారెస్పీకి భద్రత పెంచుతాం ఎస్పీ మోహన్‌రావు
Published Sat, Aug 10 2013 4:10 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
Advertisement
Advertisement