ఫేస్‌బుక్‌లో మెసేజ్ పెట్టి యువకుడి ఆత్మహత్య | Young man commit suicide, before post message in facebook | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో మెసేజ్ పెట్టి యువకుడి ఆత్మహత్య

Published Thu, Oct 3 2013 12:22 PM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

Young man commit suicide, before post message in facebook

హైదరాబాద్: యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువకుడు తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి మరీ ప్రాణాలు తీసుకున్నాడు. జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా మబ్బుగుంటపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాస్, కనకమ్మల కుమారుడు వేణు(25) స్థానికంగా బీటెక్ చదువుతున్న క్రమంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.

ఆరు నెలల క్రితం కుత్బుల్లాపూర్ సర్కిల్ ఎన్‌ఎల్‌బీనగర్‌కు వచ్చి తన స్నేహితులతో కలిసి ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు. ప్రేమించిన యువతి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోవడం లేదని బుధవారం స్నేహితులకు ఫేస్‌బుక్‌లో మెస్సేజ్ పోస్ట్ చేసి తాను చనిపోతున్నానని అందులో పేర్కొన్నాడు. బుధవారం స్నేహితుడు అనిల్ డ్యూటీకి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చి చూసేసరికి వేణు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement