
రేపు వైఎస్ జగన్ పులివెందులకు రాక
పులివెందుల : వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 24వ తేదీ బుధవారం పులివెందులకు రానున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం ఆయన ఇడుపులపాయకు చేరుకుని కుటుంబ సభ్యులతో గడపడంతోపాటు స్థానిక చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారన్నారు. 25వ తేదీ ఉదయం పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారన్నారు.