విభజిస్తే సీమాంధ్ర ఎడారే: వైఎస్ అవినాష్ రెడ్డి | Seemandhra region desert due to state bifurcation, says ysr congress party leader YS Avinash reddy | Sakshi
Sakshi News home page

విభజిస్తే సీమాంధ్ర ఎడారే: వైఎస్ అవినాష్ రెడ్డి

Published Sat, Sep 28 2013 12:41 PM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

Seemandhra region desert due to state bifurcation, says ysr congress party leader YS Avinash reddy

ప్రజలందరు కట్టిన పన్నులతోనే హైదరాబాద్ మహానగరం అభివృద్ధి చెందిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత వైఎస్ అవినాష్ రెడ్డి స్ఫష్టం చేశారు. శనివారం వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందులలో ఏర్పాటు చేసిన పొలికేకలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ నగరంతో సంబంధం లేదంటే సీమాంధ్రలో అభివృద్ది ఎలా అని ఆయన ప్రశ్నించారు.

 

రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే సమైక్య నినాదంతో ముందుకు వచ్చిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతే కృష్టా నీళ్లు కాదు, సీమాంధ్ర ప్రాంతమే ఎడారిగా మారుతోందని తెలిపారు. అందుకే రాయలసీమ ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకువస్తే జన్మ ధన్యమైనట్టే అని దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలో చెప్పిన సంగతిని యువనేత వైఎస్ అవినాష్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement