రేణిగుంటలో జగన్కు ఘన స్వాగతం
తిరుపతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రేణిగుంట విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ నినాదాలతో విమానాశ్రయం మార్మోగింది. తిరుపతిలో నేడు జరగనున్న 'వైఎస్‌ఆర్ జనభేరి' పాల్గొనేందుకు ఆయన శనివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుపతి బయల్దేరారు.
వైఎస్సార్ జనభేరిలో పాల్గొనేందుకు వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం బయలుదేరారు. నేటి నుంచి జగన్ 'వైఎస్‌ఆర్ జనభేరి' పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు.
ఇందులో భాగంగానే శనివారం తిరుమలకు వచ్చి స్వామివారి ఆశీస్సులు అందుకోవాలని జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. ఉదయం నుంచి రాత్రి వరకు తిరుపతిలో పర్యటిస్తారు. రాత్రికి తిరుమలకు చేరుకుని ఇక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకుని తిరుగు ప్రయాణమవుతారు. ఆ తర్వాత ఎన్నికల జనభేరి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు.
జగన్ షెడ్యూల్ వివరాలు:
* మార్చి 1: తిరుపతిలో సాయంత్రం 4 గంటలకు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగిస్తారు. రాత్రికి తిరుమల లో బస చేస్తారు.
*మార్చి 2 : తిరుమల నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.
*మార్చి 3: హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి విజయవాడ చేరుకుంటారు. సాయంత్రం 4గంటలకు ఏలూరు బహిరంగసభలో ప్రసంగిస్తారు.
*మార్చి 4: సాయంత్రం 4 గంటలకు నిడదవోలు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
*మార్చి 5: సాయంత్రం 4 గంటలకు ఖమ్మం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
*మార్చి 6 : సాయంత్రం 4 గంటలకు గుంటూరు జిల్లా నరసరావుపేట బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
*మార్చి7, 8 : గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తారు.
*మార్చి 9: నుంచి నల్లగొండ జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తారు.