'వైఎస్ఆర్ పేరెత్తే అర్హత సీఎం కిరణ్ కు లేదు'
'వైఎస్ఆర్ పేరెత్తే అర్హత సీఎం కిరణ్ కు లేదు'
Published Thu, Aug 8 2013 10:20 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
రాష్ట్ర విభజన నేపథ్యంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అన్ని వర్గాలు, అన్ని పార్టీల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. సీఎం కిరణ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజన ఆపడం చేతకాని సీఎం కిరణ్ అని.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై నిందలు వేయడం సిగ్గుచేటు అని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానేత వైఎస్‌ఆర్ పేరెత్తే అర్హత కూడా సీఎం కిరణ్‌కు లేదు అని బాలినేని మండిపడ్డారు.
రాష్టాన్ని విభజించాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై గత తొమ్మిది రోజులుగా మౌనంగా ఉన్న సీఎం ఇప్పుడు మాట్లాడటంలో ఆంతర్యమేంటి అని బాలినేని ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానం చేపట్టిన మరో డ్రామాలో భాగమని.. కిరణ్ ముఖ్య పాత్రధారి అని బాలినేని విమర్శించారు. విభజన అడ్డుకోవడంలో విఫలమైన ముఖ్యమంత్రి తక్షణమే పార్టీకి, సీఎం పదవికి రాజీనామా చేయాలి అని బాలినేని సూచించారు.
Advertisement