
బాబు ఎన్టీఆర్‌ను పొగిడితే అసహ్యించుకుంటారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి
విజయవాడ : దివంగత ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించివేసి ఆయన మరణానికి కారకుడైన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్టీఆర్‌ను పొగిడితే ప్రజలు అసహ్యించుకుంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరి గౌతంరెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు.
పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన్ని అనేక ఇబ్బందులకు గురిచేసిన చంద్రబాబు ఇప్పుడు ఊసరవెల్లిగా మారి ఆయన్ని కీర్తించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రజలు ఎవరూ చంద్రబాబును నమ్మరని, ఎందుకంటే అందరికీ ఆయన నిజస్వరూపం తెలుసని ఆయన చెప్పారు. ప్రజలను, ప్రజా సమస్యల్ని గాలికొదిలేసి రైతుల రుణమాఫీ గురించి పూర్తిగా మరిచిపోయి బాధ్యతారహితంగా ఉన్న సీఎం చంద్రబాబు ప్రచారం కోసమే ఇలా మాట్లాడుతున్నాడని గౌతంరెడ్డి ఎద్దేవా చేశారు.