సూర్యాపేట, న్యూస్‌లైన్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ రాక సందర్భంగా నిర్వహించే నవ భారత్ యువభేరి సమ్మేళనాన్ని విజయవంతం చేసేందుకు బీజేపీ నాయకులు కృషి చేయాలని కేం ద్ర హోంశాఖ మాజీ మంత్రి, పార్టీ జాతీ య కార్యవర్గ సభ్యుడు చెన్నంనేని విద్యాసాగర్‌రావు కోరారు. శనివారం పట్టణంలోని కిరాణ ఫ్యాన్సీ మర్చంట్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ కేవలం ఎన్నికల కోసమే పని చేయదన్నారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం, దేశం అభివృద్ధి కోసం పాటు పడుతుందన్నారు. దేశ ప్రజలంతా బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు కనీవినీ ఎరుగని రీతిలో అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారన్నారు. కేంద్ర టెలికాం మాజీ మంత్రి రాజా సుమారు లక్షా 76వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్నారు.
ఈ అవినీతి డబ్బుతో దేశంలోని రైతులకు సంబంధించిన రుణాలను మూడు సార్లు మాఫీ చేయవచ్చని చెప్పారు. అవినీతి కాంగ్రెస్‌ను అంతమొందించేందుకు ప్రజలు సిద్ధం కావాలని కోరా రు. మోడీ కి తాము ప్రచార బాధ్యతలు అప్పగిస్తే ప్రజలు దేశ ప్రధాని బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారన్నా రు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి, రాష్ర్ట ఉపాధ్యక్షుడు చింత సాంబమూర్తి, కిసాన్‌మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణం జరిగే వరకు ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఇటీవల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులుగా నిలబడి గెలుపొందిన వారిని సన్మానించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జి ప్రేమ్‌రాజ్ యాదవ్, నాయకులు బెజవాడ శేఖర్, రామినేని ప్రభాకర్, బాకి పాపయ్య, నూనె సులోచన, వీరారెడ్డి, దర్శనం వేణు, నళిని, రామకృష్ణ, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి రవికుమార్, వెంకటనారాయణరెడ్డి, శ్యాం సుందర్, ఓరుగంటి రాములు, సాం బయ్య, వెంకటేశం, నాగరాజు, ఉప్పల సంపత్‌కుమార్, చల్లమళ్ల నర్సింహ్మ, బెరైడ్డి సంజీవరెడ్డి, కొండేటి ఏడుకొండలు, పాండురంగాచారి, మంచాల రంగయ్య, రమేష్, జానకి రాములు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
‘యువభేరి’ని విజయవంతం చేయాలి
Published Sun, Aug 4 2013 5:13 AM | Last Updated on Wed, Sep 19 2018 6:36 PM
Advertisement
Advertisement