బంగారం దిగుమతులపై ఆంక్షలు తొలగించాలి | Com Min for removal of gold import curbs | Sakshi
Sakshi News home page

బంగారం దిగుమతులపై ఆంక్షలు తొలగించాలి

Published Wed, Apr 2 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM

బంగారం దిగుమతులపై ఆంక్షలు తొలగించాలి

బంగారం దిగుమతులపై ఆంక్షలు తొలగించాలి

దిగుమతులపై ఆంక్షలతో పసిడి లభ్యత తగ్గిపోయి స్మగ్లింగ్ పెరుగుతుందని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజీవ్ ఖేర్ మంగళవారం ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

న్యూఢిల్లీ: బంగారం దిగుమతులపై ఆంక్షలను తొలగించాలని కేంద్ర వాణిజ్య శాఖ కోరింది. దిగుమతులపై ఆంక్షలతో పసిడి లభ్యత తగ్గిపోయి స్మగ్లింగ్ పెరుగుతుందని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజీవ్ ఖేర్ మంగళవారం ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కరెంటు అకౌంటు లోటు (క్యాడ్)ను అదుపు చేసే చర్యల్లో భాగంగా కేంద్రం దిగుమతి సుంకాన్ని పెంచడంతో పాటు పలు ఆంక్షలు విధించింది. ఇలాంటి ఆంక్షలను వాణిజ్య శాఖ ఎన్నడూ సమర్థించలేదని ఖేర్ చెప్పారు. ఆంక్షలను దీర్ఘకాలం కొనసాగించడం సబబుకాదనీ అన్నారు.

పసిడి దిగుమతుల టారిఫ్ తగ్గింపు
బంగారం దిగుమతి విలువను(ఇంపోర్ట్ టారిఫ్) ప్రభుత్వం 10 గ్రాములకు 421 డాలర్లకు సవరించింది. ఈ ధర ఆధారంగా దిగుమతులపై ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని విధించే సంగతి తెలిసిందే. ప్రస్తుతం బంగారం విలువను 445 డాలర్లుగా నిర్ధారించి సుంకం అమలు చేస్తున్నారు. ఇదే విధంగా వెండి దిగుమతులపై విధిస్తున్న సుంకాన్ని సైతం తగ్గించిం ది. ఇప్పటివరకూ వెండి దిగుమతులపై కేజీ విలువను 694 డాలర్ల చొప్పున లెక్కిస్తూ సుంకాన్ని విధిస్తుండగా ప్రస్తుతం ఈ విలువను 644 డాలర్లకు తగ్గించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement