న్యూఢిల్లీ: సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఇండియా(సీడీఎస్‌ఎల్)లో ఉన్న డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య ఆగస్టు చివరినాటికి కోటిని దాటింది. డీమ్యాట్ అకౌంట్ల విషయంలో నిలకడైన వృద్ధిని సాధిస్తున్నామని సీడీఎస్‌ఎల్ తెలిపింది. మొత్తం డీమ్యాట్ అకౌంట్లలో తమ వాటా 42 శాతమని తెలిపింది. పదేళ్లలో తమ మార్కెట్ వాటాలో 54% వృద్ధి సాధించామని సీడీఎస్‌ఎల్ చైర్మన్ ఎన్.రంగాచారి చెప్పారు. కస్టడీ చార్జీలు లేకపోవడం, డీమ్యాట్ అకౌంట్లోకి వచ్చే సెక్యూరిటీలపై చార్జీలు విధించకపోవడం, టారిఫ్‌లను తగ్గించడం, సేవల్లో నాణ్యత తమ మార్కెట్ మెరుగుదలకు కారణమన్నారు.