ప్రవేశ స్థాయి జాబ్స్‌కు డిమాండ్ | Demand for entry-level jobs rise 6.7% in 2013: Assocham | Sakshi
Sakshi News home page

ప్రవేశ స్థాయి జాబ్స్‌కు డిమాండ్

Published Tue, Mar 4 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 4:19 AM

ప్రవేశ స్థాయి జాబ్స్‌కు డిమాండ్

ప్రవేశ స్థాయి జాబ్స్‌కు డిమాండ్

న్యూఢిల్లీ: ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు గతేడాది డిమాండ్ 6.7% పెరిగిందని అసోచామ్ అధ్యయనంలో వెల్లడైంది. ఇదే ఏడాది మిడిల్, సీనియర్ స్థాయి ఉద్యోగాలు 5.1%  క్షీణించడం గమనార్హం. కంపెనీల ఉద్యోగ ప్రకటనలతో పాటు వివిధ జాబ్ పోర్టల్స్ ద్వారా 4,500కు పైగా కంపెనీల్లో ఖాళీలను విశ్లేషించినట్లు అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. వివరాల్లోకి వెళితే... 2012లో వివిధ కంపెనీల్లో 5.52 లక్షల ఉద్యోగావకాశాలు రాగా, 2013లో ఆ సంఖ్య 5.50 లక్షలకు తగ్గింది.

ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్‌సీఆర్)లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు గతేడాది అత్యధికంగా 26.8% పెరిగాయి. హైదరాబాద్‌లో ఈ ఉద్యోగాలు 15.2% వృద్ధి చెందగా కోల్‌కతాలో 12.7%, బెంగళూరులో 6.6%, అహ్మదాబాద్‌లో 0.5% వృద్ధి రేటు నమోదైంది. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు క్షీణించిన ప్రథమ శ్రేణి నగరాల్లో ముంబై, చెన్నై ఉన్నాయి. 2013లో ఈ తరహా ఉద్యోగాలు పెరిగిన ద్వితీయ శ్రేణి నగరాల్లో నాగపూర్ (64.7%), లక్నో (39.1%), కొచ్చిన్ (35.3%), విశాఖపట్నం (22.7%), విజయవాడ (15.9%), జైపూర్ (9.5%), మీరట్ (6.9%), చండీగఢ్ (6.8%) ఉన్నాయి.

Advertisement
Advertisement