హైదరాబాద్‌లో 14% పెరిగిన రియల్టీ ధరలు
న్యూఢిల్లీ: మధ్య ఆదాయ హౌసింగ్ సెగ్మెంట్ ధరలు హైదరాబాద్‌లో సగటున 14 శాతం చొప్పున పెరిగాయని అంతర్జాతీయ ప్రోపర్టీ కన్సల్టెంట్ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ తాజా నివేదిక వెల్లడించింది. హై ఎండ్ సెగ్మెంట్ విషయంలో అయితే ధరల పెరుగుదల 16 శాతంగా ఉందని పేర్కొంది. మధ్య ఆదాయ హౌసింగ్ సెగ్మెంట్‌లో బెంగళూరులో అధిక శాతం(41 శాతం) పెరిగాయని వెల్లడించింది. గత మూడేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ సంస్థ ఈ నివేదికను రూపొందించింది.
హైఎండ్ ప్రోపర్టీల్లో ధరలు అధికంగా పుణేలో (39 శాతం) పెరిగాయి.
2011-14 కాలానికి మిడ్-సెగ్మెంట్ హౌసింగ్‌లో ఇళ్ల ధరలు 14-41 శాతం వరకూ పెరిగాయి. ఇక హైఎండ్ ప్రోపర్టీల ధరలు సగటున 16-39 శాతం పెరిగాయి.
ఆర్థిక వృద్ధి మందగమనంలో ఉండడం, డాలర్‌తో మారకం విషయంలో రూపాయి విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, తదితర కారణాల వల్ల ముంబై, ఎన్‌సీఆర్‌ల్లో ధరలు తగ్గాయని నివేదిక పేర్కొంది.