ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులకు స్పైస్‌జెట్ దెబ్బ
12 రోజుల్లో 12%పైగా నష్టం
ముంబై: స్పైస్‌జెట్‌లో పెట్టుబడుల విషయంలో ప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా తప్పటడుగు వేసినట్లు కనిపిస్తోంది. ఝున్‌ఝున్‌వాలా అంటే పటిష్ట మూలాలున్న కంపెనీలలో చిన్న స్థాయిలో వాటాలను కొనడం ద్వారా భారీ లాభాలు ఆర్జిస్తారన్న గుర్తింపు ఉన్న తెలిసిందే. అయితే ఇటీవల పలు సమస్యలు ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్‌లో ఝున్‌ఝున్‌వాలా రెండు వారాల క్రిత ం ఇన్వెస్ట్ చేశారు. రేర్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ద్వారా నవ ంబర్ 28న స్పైస్‌జెట్‌కు చెందిన 75 లక్షల షేర్ల(1.4% వాటా)ను రూ. 17.88 సగటు ధరలో కొనుగోలు చేశారు. ఇందుకు రూ. 13.4 కోట్లు వెచ్చించారు. అయితే ఆపై 12 రోజుల్లో షేరు ధర 12%పైగా క్షీణించింది.
బీఎస్‌ఈలో తాజాగా రూ. 15.65 వద్ద ముగిసింది. అయితే ఝున్‌ఝున్‌వాలా కొన్న రోజున స్పైస్‌జెట్ షేరు 18%పైగా ఎగసి రూ. 21ను దాటింది. ఈ స్థాయి నుంచి లెక్కిస్తే నష్టాలు మరింత అధికంగా ఉంటాయి. కాగా, ఆర్థిక సమస్యల కారణంగా సోమవారం 80 సర్వీసులను రద్దు చేయడమేకాకుండా, ఈ నెలాఖరు వరకూ మొత్తం 1,800 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు స్పైస్‌జెట్ ప్రకటించింది. నెల రోజులకు మించి టెకెట్ల బుకింగ్‌ను అనుమతించవద్దంటూ డీజీసీఏ స్పైస్‌జెట్‌ను ఆదేశించగా, బకాయిల నిమిత్తం రూ. 200 కోట్లమేర బ్యాంక్ గ్యారంటీలను వెంటనే సమర్పించాల్సిందిగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆదేశించింది.