ఇన్వెస్టర్లకు పెరిగిన రిస్క్: ఫిచ్
ముంబై: డెట్ ఇన్‌స్ట్రుమెం ట్లపై దక్షిణాదికి చెందిన ధనలక్ష్మి బ్యాంకు జూలై నెలలో కూపన్(వడ్డీ) చెల్లించడంలో విఫలం కావడం... నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ), నిధుల లేమి సమస్యను ఎదుర్కొంటున్న దేశీయ బ్యాంకుల నుంచి ఇన్వెస్టర్లకు ముప్పు పెరిగిం దని సూచిస్తున్నట్టు రేటింగ్ సంస్థ ఫిచ్ పేర్కొంది. బ్యాంకు క్యాపిటల్ ఇన్‌స్ట్రుమెంట్‌పై ఇన్వెస్టర్లు వడ్డీ వదులుకోవడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపింది. బ్యాంకులకు పూర్తి సహాయ సహకారాలుంటాయని అధిక అంచనాలున్న చోట ఈ విధమైన పరిణామం చోటు చేసుకోవడం వ్యవస్థకు మంచిదేనని ఫిచ్ పేర్కొంది. ధనలక్ష్మి టైర్-1 మూలధనం జూన్ చివరి నాటికి నిర్ధేశించిన 9.62 శాతానికి బదులు 7.44 శాతానికి తగ్గిపోవడంతో కూపన్ చెల్లించడాన్ని ఆర్‌బీఐ నిలిపివేసింది. బ్యాంకుల ఖాతాల ప్రక్షాళనతో ధనలక్ష్మి బ్యాంకు మూలధనంపై మార్కె ట్ వర్గాల్లో ఆందోళనలు పెరిగాయని, దీంతో కొత్తగా మూలధనం సమీకరించుకునే అవకాశాలను ఇది క్లిష్టతరం చేసిందని ఫిచ్ పేర్కొంది.