లండన్: టెలికం పరిశ్రమ సునామీ రిలయన్స్ జియో మరో సంచలనానికి తెర తీయబోతోంది. 2018 లో సొంత వర్చువల్ రియాలిటీ (వీఆర్) అప్లికేషన్‌ను ప్రారంభించనుంది. లండన్‌లోని బర్మింగ్‌హామ్‌సిటీ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఈ అప్లికేషన్‌ను మొదలుపెట్టనుంది. ఈ మేరకు యూనివర్శిటీ వీఆర్ నిపుణులతో సంప్రదింపులు నిర్వహిస్తోంది.
తరువాతి తరం వర్చువల్ రియాలిటీ వృత్తి నిపుణులకి శిక్షణ ఇవ్వడం గురించి మరింత తెలుసుకోవడానికి బుధవారం విశ్వవిద్యాలయాన్ని సందర్శించారని యూనివర్శిటీ తెలిపింది. ఈ అంశంలో తాము జియోతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నామని చెప్పింది. భవిష్యత్‌లో సంభావ్య భాగస్వామ్యాలను విశ్లేషించడానికి యోచిస్తున్నట్టు జియో స్టూడియో హెడ్ ఆదిత్య భట్ క్రియేటివ్ డైరెక్టర్ అంకిత్ శర్మ బర్మింగ్‌భహామ్ యూనివర్శిటీని సందర్శించారు.
మరోవైపు దాదాపుమంది 90మంది ఆర్టిస్తులతో యూరోప్ , ఆసియాలోని అతిపెద్ద స్టూడియోలకు సినిమాలు, టెలివిజన్లలో కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెస్, విజువల్ ఎఫెక్ట్స్ అందించే ఫిలిం సీఎంజీ స్టూడియో కూడా ఈ యూనివర్శిటీని సందర్శించింది. ముంబై, పుణేలలో ప్రముఖ యానిమేషన్ స్టూడియో వర్చువల్ రియాలిటీ, అగ్‌మెంట్ రియాలిటీ (ఎఆర్) సేవలవైపు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఫిలింసీజీఐ వ్యవస్థాపకుడు , మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ భానుషాలి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ విభాగం ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయానికి చెందిన సీనియర్ అకాడమిక్స్‌తో చర్చించారు. తమ భాగస్వామ్యంలో సరికొత్త అవకాశాలపై చర్చించామని ఆయన చెప్పారు. ఫ్రెష్ మైండ్స్‌తో తమలాంటి కంపెనీలు మరిన్నివినూత్న పరిష్కారాలను ఆవిష్కరించవచ్చని ఆనంద్ భానుషాలి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment