
20 స్టార్టప్‌ల్లో మైక్రోమ్యాక్స్ ఇన్వెస్ట్‌మెంట్స్
మొబైల్ ఫోన్‌లు తయారు చేసే మైక్రోమ్యాక్స్ కంపెనీ స్టార్టప్‌ల్లో 40 కోట్ల డాలర్ల వరకూ పెట్టుబడులు పెట్టనున్నది.
40 కోట్ల డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్‌లు తయారు చేసే మైక్రోమ్యాక్స్ కంపెనీ స్టార్టప్‌ల్లో 40 కోట్ల డాలర్ల వరకూ పెట్టుబడులు పెట్టనున్నది. ఆరోగ్య సంరక్షణ, వినోదం, గేమింగ్‌లకు సంబంధించి కనీసం 20 స్టార్టప్‌ల్లో ఈ స్థాయి పెట్టుబడులు పెట్టనున్నామని మైక్రోమ్యాక్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాహుల్ శర్మ చెప్పారు. తమ సేవల పోర్ట్‌ఫోలియోను మరింత పటిష్టం చేసుకునే చర్యల్లో భాగంగా ఒక్కో స్టార్టప్‌ల్లో 10 లక్షల నుంచి 20 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టనున్నామని వివరించారు. ఇప్పటికే బెంగళూరుకు చెందిన హెల్త్, ఫిట్‌నెస్ స్టార్టప్ హెల్తిఫైమి స్టార్టప్‌లో ఇన్వెస్ట్ చేశామని వివరించారు.