2 బిలియన్‌ డాలర్లకుపైగా తగ్గిన విదేశీ మారక నిల్వలు! | Over $ 2 billion foreign exchange reserves | Sakshi
Sakshi News home page

2 బిలియన్‌ డాలర్లకుపైగా తగ్గిన విదేశీ మారక నిల్వలు!

Published Sat, Feb 16 2019 12:04 AM | Last Updated on Sat, Feb 16 2019 12:04 AM

Over $ 2 billion foreign exchange reserves - Sakshi

ముంబై: భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు ఫిబ్రవరి 8వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం వారం (1వ తేదీ)తో పోల్చిచూస్తే, 2.11 బిలియన్‌ డాలర్లు పడిపోయాయి. 398.122 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఆర్‌బీఐ తాజా గణాంకాల ప్రకారం...

►ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసిన వారంలో విదేశీ మారకనిల్వలు వారంవారీగా 2.063 బిలియన్‌ డాలర్లు పెరిగి 400.24 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. 
►వారం తిరిగేసరికి 8వ తేదీ నాటికి డాలర్ల రూపంలో పేర్కొనే ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ 2.448 బిలియన్‌ డాలర్లు తగ్గి, 370.981 డాలర్లకి పడ్డాయి. 
►పసిడి నిల్వలు స్థిరంగా 22.68 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.
► అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ విలువ 8 మిలియన్‌ డాలర్లు తగ్గాయి. 1.462 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.
► ఇక ఐఎంఎఫ్‌కు సంబంధించి నిల్వల పరిమాణం 337.3 మిలియన్‌ డాలర్లు పెరిగి 2.991 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. 
►    2018 ఏప్రిల్‌ 13వ తేదీతో మగిసిన వారంలో విదేశీ మారకద్రవ్య నిల్వల రికార్డు స్థాయి 426.028 బిలియన్‌ డాలర్లు. అటు తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement