పెరిగిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు
ముంబై: రిజర్వుబ్యాంక్ వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు మార్చి4తో ముగిసిన వారంలో జోరుగా పెరిగాయి. ఈ నిల్వలు 407.5 కోట్ల డాలర్లు పెరిగి 35,086 కోట్ల డాలర్లకు చేరాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు(ఎఫ్‌సీఏ) బాగా పెరగడమే దీనికి ప్రధాన కారణమని ఆర్‌బీఐ పేర్కొంది. ఆర్‌బీఐ వెల్లడించిన గణాంకాల ప్రకారం.., అంతకు ముందటి రెండు వారాల్లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు క్షీణించాయి. మార్చి 4తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 244.8 కోట్ల డాలర్లు పెరిగి 32,747 కోట్ల డాలర్లకు చేరాయి. ఇక బంగారం నిల్వలు 162.8 కోట్ల డాలర్లు పెరిగి 1,932.4 కోట్ల డాలర్లకు పెరగ్గా, అంతర్జాతీయ ద్రవ్య నిధి... భారత్‌కు కేటాయించిన స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(ఎస్‌డీఆర్) 5 లక్షల డాలర్లు తగ్గి 147.9 కోట్ల డాలర్లకు పడిపోయాయి.