హైదరాబాద్: చక్కెర పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని దక్షిణ భారత చక్కెర కర్మాగారాల సంఘం (తెలంగాణ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్‌లకు ఈ మేరకు సంఘం ప్రెసిడెంట్ టి సరితా రెడ్డి, ఇతర ప్రతినిధులు ఇటీవల ఒక వినతిపత్రం సమర్పించారు. రుణ పునర్‌వ్యవస్థీకరణ, చక్కెర ధరకు అనుగుణంగా చెరకు ధర నిర్ణయానికి రెవెన్యూ షేరింగ్ విధాన రూపకల్పన, ప్రాధాన్యతా రంగంగా రుణ వెసులుబాటు వంటి ప్రయోజనాలను పరిశ్రమలకు కల్పించాలని వారు కోరారు.