ట్యాక్స్‌మెన్ నుంచి వన్ సొల్యూషన్ జీఎస్‌టీ సాఫ్ట్‌వేర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎస్‌టీ సువిధ ప్రొవైడర్లలో (జీఎస్‌పీ) ఒకటైన ట్యాక్స్‌మెన్ సంస్థ... బుధవారమిక్కడ జీఎస్‌టీ వన్ సొల్యూషన్ సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించింది. దీన్ని కేవలం జీఎస్‌టీకే కాకుండా.. ఆదాయ పన్ను, టీడీఎస్ సంబంధిత అంశాలన్నింటికీ అనుసంధానించి తయారు చేశామని కంపెనీ సీఈఓ సీఎస్ పీయూష్ కుమార్ చెప్పారు.
సాఫ్ట్‌వేర్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా సంస్థ హెడ్ (గ్రోత్ అండ్ అలయెన్సెస్) అన్‡్ష భార్గవతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ వన్ సొల్యూషన్‌ను చార్టర్డ్ అకౌంటెట్స్, కంపెనీ సెక్రటరీలు, అడ్వకేట్లు, జీఎస్‌టీ నిపుణులు, ఎస్‌ఎంఈల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశామని, ఏడాదికి గాను రూ.8,500 చార్జీ ఉంటుందని తెలియజేశారు.