
ప్రతీకాత్మక చిత్రం
ఇంతవరకు పాప తల దొరకకపోవడంతో పోలీసు జాగిలాల సహాయంతో..
రాంచి : దేశ వ్యాప్తంగా అమ్మాయిలపై అత్యాచార పర్వాలు కొనసాగుతున్నాయి. యువతులు, మహిళలపైనే కాకుండా చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న కామాంధులు వారిని హతమార్చి వికృతానందం పొందుతున్నారు. తాజాగా జార్ఖండ్‌లో అభంశుభం తెలియని మూడేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైంది. టాటానగర్ రైల్వే స్టేషనులో ఆమెను అపహరించిన ముగ్గురు వ్యక్తులు అకృత్యానికి పాల్పడి అనంతరం పాశవికంగా హతమార్చారు. మొండెం నుంచి తలను వేరు చేసి వేర్వేరు చోట్ల పడవేశారు.
ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కాగా ఇంతవరకు పాప తల దొరకకపోవడంతో పోలీసు జాగిలాల సహాయంతో గాలింపు చేపట్టారు. జూలై 26న ఈ ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.