
ఇండోర్ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ కనాడియలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు, ట్రక్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు చిన్నారులు సహా డ్రైవర్ దుర్మరణం చెందారు. ఇండోర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు విద్యార్థులతో వెళుతుండగా, ఎదురుగా వస్తున్న ట్రక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కూల్ బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.