బొమ్మ తుపాకీతో మోడల్‌పై అత్యాచారయత్నం.. | Cabbies Threaten Model with Toy Gun and Brave Girl Foils Molestation Bid | Sakshi
Sakshi News home page

బొమ్మ తుపాకీతో మోడల్‌పై అత్యాచారయత్నం..

Published Sat, Jul 27 2019 3:36 PM | Last Updated on Sat, Jul 27 2019 3:36 PM

Cabbies Threaten Model with Toy Gun and Brave Girl Foils Molestation Bid - Sakshi

జైపూర్‌ : స్నేహితురాలి లేట్‌ నైట్‌ బర్త్‌డే పార్టీకి హాజరై ఇంటికి వెళ్తున్న ఓ మోడల్‌పై ఓ క్యాబ్‌ డ్రైవర్‌, అతని స్నేహితుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. బొమ్మ తుపాకీతో బెదిరించి లోబరుచుకోవాలనుకున్నారు. కానీ సమయస్పూర్తి కనబర్చిన ఆ బ్రేవ్‌ మోడల్‌ నిందితుడి నాలుక కొరికి తప్పించుకొని సమీప పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన శుక్రవారం అర్థారాత్రి రాజస్తాన్‌లోని జైపూర్‌లో చోటు చేసుకుంది.

బాధితురాలి ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితులిద్దరిని అరెస్ట్‌ చేశారు. జైపూర్‌ ఈస్ట్‌ డీసీపీ రాహుల్‌ జైన్‌ మాట్లాడుతూ.. నిందితులు సచిన్‌శర్మ(25), క్యాబ్‌ డ్రైవర్‌ సురేశ్‌ కుమార్‌ వర్మ(30)లను అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. బాధితురాలు తన మొబైల్‌ను కారులో వదిలేసినట్లు ఫిర్యాదులో పేర్కొందని, ఆ మొబైల్‌ నెంబర్‌కు ఫోన్‌ చేయగా.. నిందితుడు సచిన్‌ శర్మ లిఫ్ట్‌ చేశాడని డీసీసీ తెలిపారు. అతను ఫోన్‌ ఎత్తడంతో వారిని పట్టుకోవడం సులువైందన్నారు. ఈ కాల్‌ ద్వారా వారి అడ్రస్‌ను ట్రేస్‌ చేయగా ఎస్‌ఎమ్‌ఎస్‌ ఆసుపత్రిలో ఉన్నట్లు తెలిసిందన్నారు. నిందితుడు సచిన్‌ శర్మ ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని నాలుకకు గాయమై తీవ్ర రక్త స్రావమైందన్నారు. అతన్ని ఆసుపత్రిలోనే అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement