కారు అపహరణ | Car Robbery In Kurnool National Highway | Sakshi
Sakshi News home page

కారు అపహరణ

Published Fri, Jul 27 2018 1:56 PM | Last Updated on Fri, Jul 27 2018 1:56 PM

Car Robbery In Kurnool National Highway - Sakshi

స్విఫ్ట్‌ డిజైర్‌ కారును ఎత్తుకెళ్తున్నట్టు సీసీ పుటేజీలో నమోదైన దృశ్యం

కర్నూలు, డోన్‌ రూరల్‌: మండల పరిధిలోని జగదుర్తి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కారు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. టీఎస్‌ 14ఏ 5164 నంబర్‌ గల స్విఫ్ట్‌ డిజైర్‌ కారును ముగ్గరు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు తెలిపారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బెంగుళూరుకు వెళ్లాలని ముగ్గురు వ్యక్తులు కారు బాడుగకు తీసుకున్నారని, కారు ఓనర్, కమ్‌ డ్రైవర్‌ అయిన విష్ణు బాడుగకు ఒప్పుకుని బెంగుళూరుకు వెళ్తుండగా.. డోన్‌ మండల పరిధిలోని జగదుర్తి గ్రామం వద్ద మూత్రం పోయడానికని దిగిన వెంటనే అతడిపై దాడి చేసి, కారు అపహరించుకుని వెళ్లారని తెలిపారు. వెంటనే తేరుకున్న విష్ణు రూరల్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని, సీఐ రాజగోపాల్‌ నాయుడు ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీహరి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement