
పెదకాకాని (పొన్నూరు) : పాత వాహనం కొనుగోలు విషయంలో కత్తితో దాడికి పాల్పడిన గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ అనుచరులు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసులు తెలిపారు. గుంటూరు ఆటోనగర్‌లో శనివారం పాత బస్సు కొనుగోలు చేసిన వ్యవహారంలో జరిగిన ఘర్షణలో ఎంపీ గల్లా జయదేవ్ అనుచరులు షబ్బీర్ ఆయన కుమారులు ఇంతియాజ్, రియాజ్, ఫిరోజ్, ఆయన సోదరుని కుమారుడు సయ్యద్ గఫార్‌లు కలిసి వైఎస్సార్‌సీపీ కార్యకర్త మురాద్ అలీపై దాడి చేయగా, అడ్డుకున్న మురాద్ అలీ సోదరుని కుమారుడు అక్రమ్‌పై కత్తితో దాడి చేసి గాయపరచిన సంగతి విదితమే. ఈ ఘటనలో మురాద్ అలీ ఫిర్యాదు మేరకు ఎంపీ అనుచరులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. కాగా, ఇదే వ్యవహారంలో ఇంతియాజ్ ఫిర్యాదు మేరకు మురాద్ అలీ, అక్రమ్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జె.అనురాధ తెలిపారు.
చదవండి : గల్లా అనుచరుల దాష్టీకం
Comments
Please login to add a commentAdd a comment