నిందితులు రవినారాయణ్
సుల్తాన్‌బజార్: వేర్వేరు ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు బుకీలను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 1.52 లక్షల నగదును స్వాధీనం చేసుకుని నిందితులను సుల్తాన్‌బజార్, ఆప్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె. నాగేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజస్థాన్‌కు చెందిన దినేశ్ వరల్డ్ కప్ సిరీస్ మ్యాచ్‌లకు గాను బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాడు. నగరంలో సైతం పంటర్లను ఆకర్శిస్తూ వారి నుంచి తెలిసిన వారితో డబ్బులు వసూల చేయిస్తున్నాడు. అదే రాష్ట్రానికి చెందిన రవినారాయణ్ రామ్‌కోఠిలోని సుమతి రెసిడెన్సీలో ఉంటూ దినేశ్ వద్ద కమీషన్ తీసుకుంటూ పంటర్ల నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. జవార్ వేణుగోపాల్ అలియాస్ ఆంథోని అనే వ్యక్తి వీరి వద్ద పందాలు కాసేవాడు. బెట్టింగ్ ముఠాపై సమాచారం అందడంతో మంగళవారం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇద్దరు బూకీల ఇళ్లపై దాడులు నిర్వహించారు. జావార్ వేణుగోపాల్ వద్ద రూ. 1.31 లక్షల నగదు, ఒక టీవీ, రిమోట్‌లు, సెటప్‌బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. వేణుగోపాల్‌పై గేమింగ్ యాక్ట్ సెక్షన్‌లకు కింద మంగళ్‌హాట్, నల్లకుంట, ఆప్జల్‌గంజ్ పోలీసుస్టేషన్‌లలో కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. రవినారాయణ్ నుంచి రూ. 21 వేల నగదు, ఓ సెల్‌ఫోన్, ఒక టీవి, సెట్‌అప్‌బాక్స్, రిమోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ. 1.52 లక్షల నగదును స్వాధీనం చేసుకుని నిందితులను సుల్తాన్‌బజార్, ఆప్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించారు.
ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
జగద్గిరిగుట్ట: బాచుపల్లిలో పోలీసులు ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాగుట్టు రట్టు చేశారు.. కౌసా ల్య కాలనీలోని టిఅండ్‌పాన్ షాపులో అదే కాలనీ కి చెందిన భూపతి రాజు కిశోర్, శ్రీనివాస్‌రావు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. మొబైల్ ఫోన్ ప్లే స్టోర్ నుంచి క్రికెట్ లైవ్ లైన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఈ యాప్ నుంచి లైవ్ మ్యాచ్ చూస్తూ మ్యాచ్‌కు కొంత నగదు చొప్పున (వేలల్లో) బెట్టింగ్‌కు పాల్పడ్డారు. భూపతి రాజు బూకీగా ఉంటూ శ్రీనివాస్‌రావు హంటర్‌గా వరల్డ్ కప్ ప్రారంభం నుంచి రేటింగ్‌ను బట్టి బెట్టింగ్‌కు పాల్పడ్డారు.మంగళవారం ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్‌పై బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడం తో దాడి చేసిన బాచుపల్లి పోలీసులు నిందితుల ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.73 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment