విద్యార్థులపై పైశాచికత్వం | dmdk leader Beating school students | Sakshi
Sakshi News home page

విద్యార్థులపై పైశాచికత్వం

Published Tue, Dec 26 2017 8:22 AM | Last Updated on Tue, Dec 26 2017 8:22 AM

dmdk leader Beating school students - Sakshi

టీ.నగర్‌: తోటలోని కర్బూజా పండును తిన్నారని పాఠశాల విద్యార్థులను చెట్టుకు కట్టి దాడి చేసిన డీఎండీకే నేతపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. వివరాలు.. తిరుపూర్‌ జిల్లా ధారాపురం కరుంగాలివలసు గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఆదివారం ఉదయం నల్లతంగాల్‌ కాలువలో స్నానం చేసేందుకు వెళ్లిన వీరు సాయంత్రం ఇళ్లకు రాలేదు. వారి తల్లిదండ్రులు, స్థానికులు ఊరంతా గాలించారు. ఇలా ఉండగా కాలువ పక్కన ఉన్న రామస్వామికి చెందిన తోటలో చెట్టుకు ఈ ముగ్గురిని తాళ్లతో బంధించారు.

గమినంచిన స్థానికులు వారి తాళ్లను విప్పి విచారించారించగా తోటలో ఉన్న కర్బూజా పండును తిన్నామని ఆతోట యజమాని రామస్వామి(50) తమను తాళ్లతో చెట్టుకు బంధించినట్లు తెలిపారు. అంతేకాకుండా తమపై రబ్బర్‌ పైప్, పాదరక్షలతో దాడి చేసినట్లు చెప్పారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు అతని కోసం గాలించగా  పరారైనట్లు తెలిసింది. రామస్వామి డీఎండీకే పట్ట ణపంచాయితీ కార్యదర్శిగా ఉన్నాడు. ఆకలిదప్పులతో ఉన్న ముగ్గురు విద్యార్థులను అంబులెన్స్‌ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రామస్వామి కోసం గాలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement