బెంగళూరు: హేతువాద రచయిత్రి గౌరీ లంకేశ్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కీలక పురోగతి సాధించింది. గౌరీ లంకేశ్‌ను అతి సమీపం నుంచి కాల్చి చంపింది పరశురామ్ వాగ్మారే అని ఫోరెన్సిక్ ల్యాబ్ ధ్రువీకరించింది. కస్టడీలో ఉన్న వాగ్మారే వాంగ్మూలం ప్రకారం హత్యకు ముందు ఘటనలను వరుస క్రమంలో చిత్రీకరించిన ఊహా జనిత వీడియోతోపాటు, హత్య జరిగిన రోజు గౌరీ లంకేశ్ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని సిట్ గుజరాత్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపగా, రెండింటిలో ఉన్న వ్యక్తి వాగ్మారే అని తేలింది. గత ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన గుర్తు తెలియని దుండగులు గౌరీని ఆమె ఇంటి వద్ద కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో సంబంధం ఉన్న 12 మంది వ్యక్తులను సిట్ ఇప్పటివరకు అరెస్టు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment