
సాక్షి, యాదాద్రి: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కుటుంబ సభ్యులకు ఐటీశాఖ రెండోసారి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం యాదాద్రి భువనగిరిజిల్లాకేంద్రం ఖిలానగర్‌లో గల నయీమ్ తల్లి తాహేరాబేగం, భార్య హసీనా బేగం, అక్క సలీమా æగం, తమ్ముడు కూతురు అహేలా బేగంకు షోకాజు నోటీసులు జారీ చేస్తూ వారి ఇంటికి అతికించారు.
ఈ నోటీసుల్లో ఈ ఆస్తులు కొనుగోలు చేయడానికి ఆదాయం ఎలా సమకూరిందో తెలపాలని పేర్కొన్నారు. డిసెంబర్ 11లోగా సమాధానం ఇవ్వాలని, లేనిపక్షంలో మిమ్మల్ని నయీమ్ బినామీలుగా గుర్తించి బినామీ ఆస్తుల నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆ విభాగం డిప్యూటీ కమిషనర్ బ్రజేంద్రకుమార్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment