
పంజగుట్ట : ఆర్టీసీ బస్సులో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. బస్సు దిగిపొమ్మన్నందుకు ఓ వ్యక్తి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగాడు. గన్ తీసి ఫైరింగ్ చేశాడు. బుల్లెట్ బస్సు రూఫ్ టాప్ నుంచి దూసుకుపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా హడలిపోయారు. ప్రయాణికులతో పాటు బస్సు డైవ్రర్ ఆందోళనకు గురయ్యారు. సికింద్రాబాద్ నుంచి ఫిల్మ్ నగర్ వెళ్తున్న 47L బస్సు (AP28Z4468)లో పంజగుట్ట శ్మశాన వాటిక వద్ద గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, డైవ్రర్ బస్సు ఎక్కడా నిలపకుండా వెళ్లినట్టు సమాచారం. కాల్పులు జరిపిన వ్యక్తి సఫారీ డ్రెస్‌లో ఉన్నాడని ప్రయాణికులు తెలిపారు. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు బస్సుతో పాటు కాల్పులు జరిపిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment