జోక్‌ చేశాడని హత్య చేశారు! | Noida Business Man Murder Over a Joke | Sakshi
Sakshi News home page

జోక్‌ చేశాడని హత్య చేశారు!

Published Tue, Jul 14 2020 10:06 AM | Last Updated on Tue, Jul 14 2020 10:33 AM

Noida Business Man Murder Over a Joke - Sakshi

లక్నో: కొద్ది రోజుల క్రితం కనిపించకుండా పోయినా నోయిడా బిజినెస్‌ మ్యాన్‌ ఆదిత్య సోని మృతదేహం సోమవారం గ్యాంగ్‌ కాలువ సమీపంలో కనిపించింది. ఈ నెల 5న ఆదిత్య తన నివాసం నుంచి ఢిల్లీలోని ఓ బంధువును కలవడానికి వెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదు. దాంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమవారం గ్యాంగ్‌ కెనాల్‌ వద్ద ఆదిత్య మృతదేహం లభ్యమయ్యింది. ఈ క్రమంలో ఇందుకు కారణమయిన పంకజ్‌, దేవ్‌ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిద్దరు ఆదిత్య స్నేహితులు కావడం విశేషం. పోలీసుల విచారణలో ఆదిత్యను హత్య చేయడానికి గల కారణం తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు.

వివరాలు ‘ఆదిత్య మమ్మల్ని కలవడానికి వచ్చాడు. అప్పుడు మాటల మధ్యలో ఆదిత్య ఓ జోక్‌ చేశాడు. దాని గురించి మా ముగ్గిరి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో మేం ఆదిత్య మీద కర్రలతో దాడి చేసి చంపేశాం. అతడి సెల్‌ఫోన్‌, బంగారం తీసుకుని ఆదిత్య శవాన్ని గ్యాంగ్‌ కెనాల్‌ సమీపంలోని ఓ డంప్‌యార్డ్‌లో పడేశాం’ అని తెలిపారు. పంకజ్‌, దేవ్‌ల మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement