కట్నంగా 2 సెంట్ల స్థలం ఇచ్చారు.. కానీ | parents attack his daughter in krishna district | Sakshi
Sakshi News home page

కట్నంగా 2 సెంట్ల స్థలం ఇచ్చారు.. కానీ

Published Tue, Feb 27 2018 5:04 PM | Last Updated on Tue, Aug 21 2018 6:02 PM

parents attack his daughter in krishna district - Sakshi

సాక్షి, కృష్ణా: కన్న తల్లిదండ్రులు, సోదరుడు కలిసి కుమార్తెపై దాడికి దిగారు. జిల్లాలోని పెనమలూరు మండలం వణుకురు గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాలివి..  కుద్భాని, మస్తాన్‌వలిలు దంపతులు. వీరికి విర్జయ్‌, మస్తానమ్మ అనే ఇద్దరు సంతానం ఉన్నారు. 

మస్తానమ్మను హుస్సేన్‌కి ఇచ్చి 16 సంవత్సరాల క్రితం వివాహం చేశారు.  పెళ్లి సమయంలో పుట్టింటివారు కట్నంగా 2 సెంట్ల స్థలం ఇచ్చారు. ప్రస్తుతం ఆ భూమికి బాగా రేటు పెరిగిపోయిం‍ది. దీంతో భూమిని తిరిగి ఇవ్వాలని తల్లిదండ్రులు,  సోదరుడు కలిసి డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ఇరు కుటుంబాల మధ్య గొడవ కూడా జరిగింది. ఇటీవల మస్తానమ్మ కన్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

కూతురిపై  కోపోద్రిక్తులైన కన్నవారు ఆమె ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బాధితురాలి తల్లిదండ్రులు, సోదరుడులపై కేసు నమోదు అయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement