చీపురుపల్లి రూరల్: పట్టుబడిన మందుగుండు సామగ్రి, నిందితులతో పోలీసులు
విజయనగరం, చీపురుపల్లిరూరల్: ఎలాంటి లైసెన్స్ లేకుండా అనధికారకంగా మందుగుండు సామగ్రి అమ్ముతున్న ఐదుగురు వ్యక్తులను చీపురుపల్లి ఎస్సై దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని కర్లాంలో దీపావళి పండుగ సందర్భంగా అనధికారకంగా మందుగుండు సామాగ్రిని అమ్ముతున్నారని వచ్చిన సమాచారం మేరకు ఎస్సై దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ సందర్భంగా కోరాడ ఆంజనేయులు, కోరాడ ప్రసాదరావు, కోరాడ తవిటిరాజు, కిల్లంశెట్టి గోవిందరావు, కిల్లంశెట్టి లక్ష్మణరావులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద రనుంచి 21 వేల రపాయల గ్రామంలోనికి వెల్లి దాడి చేసారు. ఈసంఘటనలో అనధికారకంగా బాణాసంచాను అమ్ముతున్న గ్రామానికి చెందిన కోరాడ ఆంజనేయులు,కోరాడ ప్రసాదరావు,కోరాడ తవిటిరాజు,కిల్లంశెట్టి గోవిందరావు,కిల్లంశెట్టి లక్ష్మణరావులు అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 21వేలు విలువ గల బాణాసంచాను స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేశారు.
తయారీ స్థావరంపై దాడి
వేపాడ: మండలంలోని సోంపురం, అరిగిపాలెం గ్రామాల్లో అనుమతుల్లేకుండా బాణాసంచా తయారు చేస్తున్న స్థావరంపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా 1625 తాటాకు బాంబులు, ఐదు కిలోల మిశ్రమం, 500 ఖాళీ చిచ్చుబుడ్లు, 400 తారా జువ్వలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సాగర్‌బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరి నిందితులను అరెస్ట్ చేసి బెయిల్‌పై విడుదల చేసినట్లు చెప్పారు.
ఆతవలో బాణసంచా స్వాధీనం
టీవీఎస్ ఎక్సె్సల్ వాహనంపై బాణసంచా తరలిస్తున్న వ్యక్తిని ఆతవలో స్పెషల్ బ్రాంచ్‌పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఎల్.కోట మండలం వేచలపువానిపాలెంనకు చెందిన ఎన్‌వై కుమార్ సుమారు ఆరువేల రూపాయల విలువైన బాణసంచాను తీసుకెళ్తుండగా పట్టుబడ్డాడు. నిందితుడ్ని వల్లంపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించగా, ఎస్సై సాగర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment