
విశాఖపట్నం: ప్రత్యేక హోదా కోసం ఆత్మార్పణం చేసిన త్రినాథ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. మరికాసేపట్లో నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి త్రినాథ్ భౌతికకాయాన్ని రాజమండ్రికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆసుపత్రి వద్ద త్రినాథ్ కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు గొల్లబాబూరావు, సీపీఎం నాయకులు అప్పల రాజు పరామర్శించారు. గొల్లబాబూ రావు మాట్లాడుతూ..త్రినాథ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమను ఆదేశించారని తెలిపారు. త్రినాథ్ కుటుంబాన్ని ఆదుకుంటామని కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు.
అప్పల రాజు మాట్లాడుతూ..ప్రభుత్వం కూడా త్రినాథ్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్రినాథ్ బంధువు నూకరాజు మాట్లాడుతూ..ప్రత్యేక హోదా కోసం అందరూ కలసి చిత్తశుద్ధిగా పోరాడాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment