
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, రంగారెడ్డి: జాల్లాలోని నందిగామ శివారులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంబవించింది. కర్నూలు జిల్లా ఎమిగనూరు నుంచి హైదరాబాద్‌కు ఉల్లి లోడుతో వస్తున్న లారీ నందిగామ తాండ బైపాస్ రోడ్డు వద్ద ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. బాధితులను షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిని రామలక్ష్మి, లారీ క్లీనర్ నాగరాజుగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment