
డ్రెయిన్‌లో నుంచి బయటకు తీసిన హుండీలు
సాక్షి, కోనేరు(మచిలీపట్నం): జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని చిలకలపూడి ఎఫ్‌సీఐ గోదాము సమీపంలోని డ్రెయినేజీలో రెండు హుండీలు దర్శనమిచ్చాయి. రోడ్డు పక్కన ఉన్న డ్రెయిన్‌లో పలువురు యానాదులు ఇనుపముక్కల కోసం వెతుకుతుంటారు.
దీనిలో భాగంగా బుధవారం యానాదులకు డ్రెయిన్‌లో పగులకొట్టి ఉన్న రెండు కానుకల హుండీలు దొరికాయి. విషయాన్ని గ్రహించిన స్థానికులు హుండీలను పక్కనపెట్టి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు హుండీలను పరిశీలించి ఇతర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన దుండగులు హుండీలోని నగదును అపహరించి వాటిని డ్రెయిన్‌లో పడవేసినట్లుగా భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment