సాక్షి, చీపురుపల్లి: పక్కింట్లో ఉన్న మైనర్‌ను బెదిరించి గర్భవతిని చేసిన ఓ కామాంధుడి ఘాతుకమిది. బాలిక స్నానం చేస్తుండగా యువకుడు సెల్‌లో ఫొటోలు తీసి తన కోరిక తీర్చకపోతే ఫేస్‌బుక్, వాట్సాప్‌లో పెడతానని బెదిరించి... ఆమెను లోబర్చుకుని గర్భవతిని చేసిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి బొబ్బిలి డీఎస్పీ పాపారావు అందించిన వివరాలివి. చీపురుపల్లి పట్టణంలోని జి.అగ్రహారానికి చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక స్నానం చేస్తుండగా అదే వెనుక ఇంటిలో ఉన్న చింతపల్లి రాజా అనే 22 ఏళ్ల యువకుడు రెండు నెలల క్రితం సెల్‌లో ఫొటోలు తీశాడు. చదవండి: ఆ క్రెడిట్ నా తల్లి, తండ్రి తరువాత నాగబాబుకే
వాటిని బాలికకు చూపించి తన కోరిక తీర్చాలని లేదంటే ఫొటోలను వాట్సాప్, ఫేస్‌బుక్‌లో పెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు. చేసేది లేక ఆమె లొంగిపోయింది. బాలికకు రుతుస్రావం కాకపోవడంతో అనుమానించిన తల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె గర్భవతిగా గుర్తించారు. అప్పుడు అసలు విషయం ఆమె తల్లిదండ్రులకు చెప్పగా, ఈ నెల ఒకటో తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై బొబ్బిలి డీఎస్పీ మంగళవారం చీపురుపల్లి వచ్చి దర్యాప్తు నిర్వహించారు. యువకుడు రాజును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. చదవండి: పండు.. మామూలోడు కాదు!
Comments
Please login to add a commentAdd a comment