
మృతి చెందిన శ్రీమంగా భవాని
కృష్ణా ,కంకిపాడు: కోచింగ్‌కు బైక్‌పై వెళ్లేందుకు తండ్రి అంగీకరించకపోవటంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కృష్ణాజిల్లా కంకిపాడులో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కోళ్ల శ్రీమంగాభవాని(20) బీఎస్సీ పూర్తి చేసింది. బ్యాంకు ఉద్యోగానికి కోచింగ్ కోసం విజయవాడ వెళుతోంది. ఈ క్రమంలో విజయవాడ వెళ్లేందుకు బైక్ కావాలని తండ్రి శ్రీనివాసరావును అడిగింది. అందుకు ఆయన అంగీకరించకపోవటంతో మనస్తాపానికి గురైన కుమార్తె ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంట గదిలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటిలో కూరగాయలు ఇచ్చేందుకు శ్రీమంగాభవాని అన్నయ్య ఇంటికి వచ్చాడు.
తలుపులు తెరుచుకోకపోవటంతో కిటికీలో నుంచి చూసేసరికి ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే విషయాన్ని స్థానికంగా ఇనుప దుకాణంలో ఉన్న తల్లిదండ్రులకు తెలియజేశాడు. తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి భవానీ మృతి చెందింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎస్‌ఐ షరీఫ్ ఘటనాస్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment