టెక్సాస్‌లోని డల్లాస్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్ విక్రమార్క మూడు రోజులు పర్యటించారు.
డల్లాస్ :
టెక్సాస్‌లోని డల్లాస్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మూడు రోజులు పర్యటించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా ఏపీ అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినందుకు గానూ టీఓఐఎన్‌సీ(తెలంగాణ ఓవర్సీస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) మల్లు బట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపింది. టీఓఐఎన్‌సీ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు, టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో భారీగా తెలంగాణకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు పాల్గొని, రైతు వ్యతిరేక పాలసీలు, ఖమ్మం మిర్చి యార్డు సమస్య, ప్రాజెక్టుల రీ డిజైనింగ్ వల్ల కలిగే నష్టాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో టీపీఏడీ, డీఏటీఏ, ఆటా, టాంటెక్స్ సంఘాలు కూడా పాల్గొన్నాయి. డల్లాస్‌లోని గాంధీ విగ్రహానికి మల్లు భట్టి విక్రమార్క నివాళులు అర్పించారు. టీఓఐఎన్‌సీ కన్వీనర్ ఫణీందర్ రెడ్డి బద్దం, సురేష్ గొట్టిముక్కుల, నిఖిల్ గూడూరు,
వాణీ గీట్ల, సబితా గీట్లలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తమ వంతు కృషి చేశారు.