ఆటో బోల్తా : 11 మందికి గాయాలు | 11 injured in auto accident | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా : 11 మందికి గాయాలు

Published Fri, Oct 7 2016 1:19 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

11 injured in auto accident

హిందూపురం అర్బన్‌ : హిందూపురం సమీపంలోని కొట్నూరు చెరువు వన్నమ్మ గుడి వద్ద గురువారం ఆటో బోల్తా పడిన సంఘటనలో 11 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. చలివెందల గ్రామం నుంచి ప్రయాణికులతో వస్తున్న ఆటో కొట్నూరు క్రాస్‌ వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పyì ంది. ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 11 మంది గాయపడ్డారు.

స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 వాహనంలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిలో చలివెందలకు చెందిన బాషాకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని బెంగళూరుకు తరలించాలని సూచించారు. అలాగే ఆటో డ్రైవర్‌నరసింహప్పకు కాలు విరిగింది. వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

పోల్

Advertisement