టీడీపీ నేతలకు 6నెలల జైలు | 3 TDP leaders sentenced to jail for 6 months | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలకు 6నెలల జైలు

Published Fri, Nov 13 2015 7:57 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

టీడీపీ నేతలకు 6నెలల జైలు - Sakshi

టీడీపీ నేతలకు 6నెలల జైలు

విశాఖపట్నం: ముగ్గురు టీడీపీ నేతలకు అనకాపల్లి కోర్టు జైలుశిక్ష విధించింది. పరవాడ టీడీపీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడుతో పాటు వెంకట్రావు, రవికూమార్లకు ఆరు నెలల పాటు జైలుశిక్ష విధిస్తూ అనకాపల్లి 5వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. 2006 సంవత్సరంలో ఓ పోలీసు అధికారి విధులకు ఆటంకం కలిగించిన కేసులో వీరంతా నిందితులుగా ఉన్నారు. ఆనాటి ఘటనలో పోలీసు అధికారి విధులకు ఆటంకం కల్గించారనే వాదనతో కోర్టు ఏకీభవించి వీరికి శిక్ష ఖరారు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement